WhatsApp Image 2024 04 02 at 2.05.37 PM
Trinethram News : ఏపీ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడుకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ రవి కోత అస్సాం స్టేట్ 51వ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. 1993వ బ్యాచ్ కు చెందిన ఈయన అస్సాం సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన తొలి డాక్టరేట్ కావడం విశేషం.
1966 ఏప్రిల్ 12న జన్మించిన రవి కోత భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో పీహెచ్‌డీ చేసి గోల్డ్ మెడల్ సాధించారు. రవి అస్సాం సీఎస్ తో పాటు పరిశ్రమలు, వాణిజ్యం, ఆర్థిక శాఖ, ప్రభుత్వ రంగ సంస్థలకు అదనపు ప్రత్యేక సెక్రటరీగా వ్యవహరించనున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో గల ఇండియన్ ఎంబసీలో ఆర్థిక శాఖకు చీఫ్‌గా వ్యవహరించారు.
గతంలో ఎం.జి.వి.కె.భాను అస్సాం ప్రభుత్వంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ గా పని చేసిన విషయం విదితమే.
