వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు. గండీడ్ మండలం చెన్నాయపల్లి తాండ గ్రామపంచాయతీ పరిధిలోని మాలగుడిసెలకు చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పరిగి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాల పెద్ద అంజిలయ్య, చిన్న అంజిలయ్య, మాల రమేష్, మాల సురేష్,మాల కృష్ణ,కర్నె వెంకటయ్య,కర్నె రమేష్,బాధురి వెంకటయ్య,గిరిమోని మొగులయ్య తదితరులు సహా సుమారు 50 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


