ఘనంగా సన్మానం

TRINETHRAM NEWS

తేదీ : 11/10/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం పట్టణం, అశ్వరావుపేట వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్నటువంటి ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపంలో పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి. కిషోర్ ఆధ్వర్యంలో డైనమిక్ శాసనసభ్యులు సొంగా. రోషన్ కుమార్ డీఎస్సీ రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం పరీక్షలలో విజయం సాధించిన నూతన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ గురువులు సమాజానికి ఆదర్శమని, గత వైసిపి ప్రభుత్వం లో గురువులపై కట్టేసాదింపులకు పాల్పడ్డారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ తీసి ఇచ్చిన మాట నిలబెట్టుకొని , కొత్త ఉపాధ్యాయులను నియమించిందని అన్నారు.

రాష్ట్రంలో చింతలపూడి నియోజకవర్గంలోనే నూట యాభై మంది. విజయం సాధించి ఆ నియోజకవర్గానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారని గర్వపడ్డారు. వాళ్లకు జ్ఞాపికలతో పాటు శాలువాలతో ఘనంగా సత్కరించారు. అన్ని వృత్తుల్లో నాకు అత్యంత ఇష్టమైనది ఉపాధ్యాయ వృత్తి అని, ఒక ఉపాధ్యాయుడు సమాజాన్ని తీర్చిదిద్దగలడని, విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చగల శక్తి ఉన్నవాళ్లు ఉపాధ్యాయులే అని సంతోషంతో తెలిపారు.
ఇంతమంది కొత్త ఉపాధ్యాయులు ఎంపిక కావడం పూర్వజన్మ సుకృతం పేర్కొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా నిలిచి , విద్యార్థులకు వెలుగులు నిచ్చే మార్గదర్శకులుగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఉమ్మడి కూటమి నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి. శ్యామ్ సుందర్ శేషు , మరియు రాష్ట్రం, జిల్లా, గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు , లింగపాలెం, కామవరపుకోట, చింతలపూడి, జంగారెడ్డిగూడెం మండలాల యం ఈ వో లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Honored with great honor

You cannot copy content of this page

Scroll to Top