83కి చేరిన మృతుల సంఖ్య
Trinethram News : హాంకాంగ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 83కి చేరింది. ఇంకా 270 మంది ఆచూకీ తెలియకపోవడంతో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. రెసిడెన్షియల్ కాంప్లెక్స్ రిపేర్ల సమయంలో కార్మికుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఘటనకు కొంతసేపటి ముందు ఓ వర్కర్ స్మోకింగ్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీడియోపై నిజానిజాలు దర్యాప్తుతోనే బయటపడతాయని అధికారులు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


