పాఠశాల మరియు కళాశాల వివరణలు తెలిపిన హెచ్ఎం లు, ప్రిన్సిపాల్ లు

TRINETHRAM NEWS

తేదీ : 20/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం,లో
ఉన్నటువంటి పలు మండల పరిషత్ ఉన్నత పాఠశాల లు, మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ప్రభుత్వం సమయపాలన విధంగా నే నడుస్తున్నాయి. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన మరియు క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం భోజన పథకం సన్న బియ్యం తో వండిన భోజనం, పౌష్టిక ఆహారం, పెట్టడం జరుగుతుంది. జీలుగుమిల్లి మండలం బరింకలపాడు లో ఉన్న గురుకుల గిరిజన సంక్షేమ బాలురు వసతి గృహం మరియు పాఠశాల యందు ఎస్. రామకృష్ణ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు. ఎమ్మెస్సీ బీఈడీ చదివి రాష్ట్రంలోని అనేక గిరిజన సంక్షేమ పాఠశాలలో పనిచేసి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకోవడం జరిగింది. అయితే ఈ పాఠశాలలో ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ఉందని తెలిపారు. ఇందులో మొత్తం విద్యార్థులు నాలుగు వందలమంది . పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు డెబ్బై నాలుగు మంది అందరూ కూడా ఉత్తీర్ణులు అయ్యారు. ఆరు వందలు మార్కులకు గాను కె. రవికుమార్ ఐదు వందల ఐదు మార్కులు సాధించి ప్రథమ స్థానాన్ని గెలిచాడు అని తెలిపారు.

అదేవిధంగా గిరిజన గురుకుల జూనియర్ కళాశాల లో పబ్లిక్ పరీక్షలు రాసినటువంటి విద్యార్థుల్లో ఎంపీసీ విభాగంలో ఎ. నాగేంద్ర కుమార్ రెడ్డి వేయి మార్కులకు గాను తొమ్మిది వందల ముప్ఫై రెండు మార్కులు సాధించి ప్రథమ జయించాడని, అదేవిధంగా బైపిసి విభాగంలో బాలు చందు తొమ్మిది వందల మూడు మార్కులతో ప్రథమ స్థానాన్ని గెలిచాడని. కళాశాల ఇంచార్జ్ చంద్రశేఖర్ శర్మ తెలిపారు. జీలుగుమిల్లి మండలం , కనకాపురం గ్రామం లో ఉన్నటువంటి మండల పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. సురేష్ మాట్లాడుతూ ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు తరగతులు ఉన్నాయని తెలిపారు. ఇందులో మొత్తం విద్యార్థులు ముప్ఫై మూడు అని అన్నారు. బాలురు పద్నాలుగు రు బాలికలు పంతోమ్మిది అని అన్నారు. మండల పరిషత్ ఉన్నత పాఠశాల రౌతు గూడెం ప్రధానోపాధ్యాయులు రాగాల. సోమేశ్వరరావు మాట్లాడుతూ ఆ పాఠశాలలో మొత్తం విద్యార్థులు ఇరవై రెండు అని అన్నారు. ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు తెలుగు మరి ఇంగ్లీష్ మీడియం ఉన్నట్లు తెలిపారు. మధ్యాహ్నం విద్యార్థులకు భోజనం తయారు చేయడానికి వర్కర్స్ ఎవరూ రావట్లేదని బాధపడుతున్నారు. తన సొంత డబ్బులు వచ్చే పని మనుషులకి ఇచ్చి వంట చేపిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే వంటకు సంబంధించిన వర్కర్లను నియమించాలని కోరారు. రెడ్డి గణపవరం మండల పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె. సుమలత బి ఎస్సీ బీఈడీ
ఆ పాఠశాలలో కూడా మొత్తం విద్యార్థులు ఇరవై తొమ్మిది అని తెలిపారు ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు ఉన్నట్లు అనడం జరిగింది. ఎ. రాధా ప్రధానోపాధ్యాయురాలు బి ఏ బి ఈ డి మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో చేస్తున్నారు. ఇక్కడ కూడా ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు ఉన్నట్లు తెలిపారు. తెలుగు మరి ఇంగ్లీష్ మీడియం ఉన్నట్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా రెడ్డి గణపవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు యస్. రామారావు బి ఏ బీఈడీ ఆ పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు తరగతుల గలవు. మొత్తం విద్యార్థులు నూట డెబ్బై ఒకటి అని అనడం జరిగింది. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో లంకా. గౌరీ మీనాక్షి ఆరు వందలు మార్కులకు గాను ఐదు వందల మార్కుల మూడు మార్కులు సాధించి ప్రథమ స్థానాన్ని గెలిచింది.బి. సూర్య మహేష్ నాలుగు వందల తొంబై మార్కులతో ద్వితీయ స్థానాన్ని పొందడం జరిగింది. జి. సందీప్ బాబు నాలుగు వందల అరవై ఐదు మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించాడు.
జీలుగుమిల్లి మండలం అంకంపాలెం జి. వెంకటేష్ ప్రధానోపాధ్యాయులు బి ఎస్సీ బిఈడి మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. ఇందులో కూడా ఒకటవ తరగతి నుండి ఐదు వతరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం కలదు. అని అన్నారు. ఇందులో మొత్తం విద్యార్థులు నలభై ఏడు అని చెప్పారు. ప్రతి మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పథకం కింద సన్న బియ్యం తో అన్నము పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని. తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూడా సన్నబియ్యము అన్నము, పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. మండల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం సమయపాలన ఈ విధంగా నడుస్తున్నామని తెలపడం జరిగింది.
బుట్టాయిగూడెం లో ఉన్నటువంటి ఐటిఐ కళాశాలలో వి. రవికుమార్ బీటెక్ ప్రిన్సిపాల్ గా ఉన్నారు. ఆ కళాశాలలో ఎలక్ట్రీషియన్, పి ట్టర్, డీజిల్ మెకానిక్, తదితర గ్రూపులు ఉన్నాయని తెలిపారు. మొత్తం విద్యార్థులు నూట తొంభై రెండు అని తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో కె. సుబ్బలక్ష్మి ఎంఎస్సీ బీఈడీ ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు.ఈ పాఠశాలలో ఆరవ తరగతి నుండి పన్నెo డు వ తరగతి వరకు కలదని తెలిపారు. పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఆరు వందలు మార్కులకు గాను కె. లావణ్య ఐదు వందల డెబ్బై తొమ్మిది మార్కులు సాధించి ప్రథమ స్థానాన్ని గెలిచింది. అని అన్నారు మధ్యాహ్నం భోజనం పథకం కింద విద్యార్థులకు సన్న బియ్యం పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. క్రమశిక్షణతో కూడిన విద్య, బోధన ఆటలు ఉన్నాయని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

HMs and Principals who

You cannot copy content of this page

Scroll to Top