ఇద్దరు యువకుల అరెస్టు.
రిమాండ్ నిందితుడి నుంచి విలువైన భూములు, ఖరీదైన కారు, ఆస్తి పత్రాలు, ప్రామిసరీ నోట్లు, ఐఫోన్ స్వాధీనం.
అధిక వడ్డీల బాధితులు నేరుగా సిఐ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు.
దేవరకొండ ఏఎస్పి మౌనిక.
దేవరకొండ డివిజన్ అక్టోబర్ 15 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం లో”అధిక వడ్డీలు ఇస్తానని ఆశ చూపి అమాయక ప్రజల నుండి కోట్లాది రూపాయలు వసూలు” చేసిన ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దేవరకొండ ఏఎస్పీ మౌనిక, ఎస్ఐ అజ్మీరా రమేష్ తో కలిసి తెలిపిన వివరాల ప్రకారం అధిక వడ్డీల ఘటనలో బాలాజీ నాయక్ అరెస్ట్ చేసి విచారణ నేపద్యంలో మరో ఇద్దరు ఎజెంట్లు ఇస్లావత్ అభిషేక్ నాయక్, మహేష్ లను బాధితుల ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశామన్నారు.
బాలాజీ నాయక్ మరియు మధు అనే ఇద్దరు అమాయకుల నుండి నూటికి పది నుండి 15 రూపాయల వడ్డీ చెల్లిస్తామని పలువురి నుండి కోట్లాది రూపాయలు తీసుకున్న విషయం తెలిసిందే. నిందితుల్లో ఒకరైన మధుకు మధ్యవర్తిగా వ్యవహరించిన ఇస్లావత్ అభిషేక్ నాయక్ మరియు అతని డ్రైవర్ మహేష్ ను పోలీసులు తెల్లవారుజామున స్థానిక దేవరకొండ రోడ్డులో గల తహసిల్దార్ కార్యాలయం ముందు అదుపులోకి తీసుకున్నట్లు ఏ ఎస్పీ మౌనిక తెలిపారు. ఈ క్రమంలో అభిషేక్ నాయక్ ను విచారించగా గత నవంబర్ నెలలో మధు అనే వ్యక్తితో తనకు పరిచయం ఏర్పడిందని అతని సూచన మేరకు పలువురు నుంచి డబ్బులు సేకరించి మధుకు ఇచ్చినట్లు తెలిపారు.
ఈ క్రమంలో నాంపల్లి మండలంలో అభిషేక్ నాయక్ పేరిట ఉన్న 23 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలను, ఒక ఫార్చునర్ కారును, ఒక చరవానిని, విలువైన ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మౌనిక తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


