BRSV : బిఆర్ఎస్వీ ఆధ్వర్యంలో “హలో విద్యార్థి చలో కలెక్టరేట్” ముట్టడి.

TRINETHRAM NEWS

పెండింగ్ లో ఉన్న ఫీజు రియాంబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్” ముట్టడి కార్యక్రమం.
బిఆర్ఎస్వీ నియోజకవర్గ అద్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ

దేవరకొండ డివిజన్ అక్టోబర్ 28 త్రినేత్రం న్యూస్. బిఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఈ నెల 29న ..”హలో విద్యార్థి చలో కలెక్టరేట్” ముట్టడి కార్యక్రమం విజయవంతం చేయాలి అని బిఆర్ఎస్వీ నియోజకవర్గ అద్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ కోరారు. మంగళవారం దేవరకొండ పట్టణంలో ఆయన మాట్లాడుతూ……పెండింగ్ లో ఉన్న ఫీజు రియాంబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్” ముట్టడి నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఒక వైపు గురుకుల పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తు మరొ వైపు ఎస్ సి , ఎస్ టి , బీ సీ. పేద విద్యార్థులకు ఫీజు రియాంబర్స్ మెంట్ చెల్లించక దాదాపు 23 నెలలు, డిగ్రీ పూర్తి అయినా విద్యార్థులు పై చదువులకు పోవడానికి టి సి లు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది అని ఆయన తెలిపారు.

23 నెలలు నుంచి విద్యాశాఖకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల అనేక సమస్యలు విద్యారంగంలో ఉన్నాయి అని ఆయన తెలిపారు.విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్ రాకపోవడం వల్ల, పై చదువులకు వెళ్ళడానికి విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని ఆయన చెప్పారు.విదేశీ విద్యను అభ్యసిస్తునటువంటి అంబేద్కర్ స్కాలర్ షిప్ ఎస్సీ, ఎస్ టీ , బీ సీ , జ్యోతిరావు పూలే స్కాలర్ షిప్, మైనారిటీ విద్యార్థులకి గత మూడు సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్నటువంటి 350 కోట్ల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ పనులు చేసిన తమ మంత్రులకు బిల్లులు క్లియర్ చెసింది కానీ విద్యాసంస్థ యాజమాన్యంలకు మాత్రం ఫీజురీయింబర్స్మెంట్ బిల్లులు క్లియర్ చేయలేకపోయారు అని ఆయన ఆరోపించారు.పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు ప్రభుత్వం విడుదల చేసె వరకు బిఆర్ఎస్వీ తరుపున పోరాటం ఆగదు అని ఆయన అన్నారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న 8150కోట్ల ఫీజు రియాంబర్స్మెంట్, స్కాలర్ షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఆయన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

"Hello Student, Come to Collectorate"

You cannot copy content of this page

Scroll to Top