Gaddam Prasad Kumar : మొంథా తుఫాను ప్రభావంతో వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, *వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ .. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు తమ తమ పరిధిలో అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలి.
ముఖ్యంగా పోలీసు, రెవిన్యూ, విద్యుత్, సాగునీటి శాఖల అధికారులు, సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉంటూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల సహకారం తీసుకుని అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలి.లో కాజ్ వే లు, కల్వర్టులు, చెరువు అలుగుల వద్ద భద్రతా ఏర్పాట్లు చేయాలి, అవసరమైన చోట్ల సిబ్బందిని కాపలాగా నియమించాలి. వర్షాలు తగ్గే వరకు ప్రజలు తమ ఇళ్ళలోనే ఉండాలి, బయటకు రాకండి. అత్యవసరమైతే, తగు జాగ్రత్తలతో ప్రయాణాలు చేయండి.చెరువులు, వాగులు, నీటి వనరుల సమీపానికి వెళ్ళవద్దు. కరంటు స్తంభాలను తాకవద్దు.
వర్షాలకు సాగులో ఉన్న పత్తి, వరి, ఇతర పంటలు దెబ్బతినకుండా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ అధికారులు మీకు 24 గంటలు అందుబాటులో ఉంటారు, సహాయం అవసరమైన ప్రజలు వెంటనే స్థానిక ప్రభుత్వ అధికారులను సంప్రదించండి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Heavy rains in Vikarabad district

You cannot copy content of this page

Scroll to Top