Compensation for Farmers : మొంథా తుఫాన్ ప్రభావిత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా అరకులోయ అక్టోబర్ 30, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం చినలబుడు పంచాయతీ పరిధిలోని దొరవలస, గొందివలస, తుడుం గ్రామాల్లో మొంథా తుఫాన్ వల్ల వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆదివాసీ గిరిజన సంఘం బృందం మువ్వల రాజు, వంతాల దస్మత్, గొల్లూరి సొన్ను పంట పొలాలను పరిశీలించి, నష్టపోయిన రైతులకు తక్షణ నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో వరి, చోడి, రాజ్మా పంటలు నాశనమయ్యాయని, అధికారులు సమగ్ర సర్వే నిర్వహించి పంట బీమా పథకం అమలు చేయాలని కోరారు. తుఫాన్ వల్ల దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, పాఠశాల భవనాలను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పెసా కార్యదర్శి ముసిరి మల్లన్న, కొర్రా సుబ్బారావు, కొర్రా రాజు, ముసిరి అప్పన్న, మామిడి రాంబాబు, గెమ్మెల దాసు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Demand for compensation for farmers

You cannot copy content of this page

Scroll to Top