Heavy Rain : తెలంగాణలో భారీ వర్షం.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

TRINETHRAM NEWS

Heavy rain in Telangana.. Yellow alert for these districts

Trinethram News : తెలంగాణ : తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగర్ కర్నూల్, నల్గొండ, వనపర్తి, గద్వాల్, సంగారెడ్డి, మెదక్, నిజమాబాద్, నిర్మల్, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.

మరో మూడు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, కామారెడ్డిలో ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

హైదరాబాద్ నగరంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మియాపూర్, లింగంపల్లి, షేక్ పేట, మెహదీపట్నం, కూకట్పల్లి, కొండాపూర్, మాదాపూర్, రాజేంద్రనగర్, టోలీచౌకి, నిజాంపేట్ ఏరియాల్లో వర్షం కురిసింది. ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇంటి నుంచి బయటకు ఎవరు రాకుండా ఉండాలని వాతావరణ శాఖ ప్రజలను సూచించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

1 thought on “Heavy Rain : తెలంగాణలో భారీ వర్షం.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్”

  1. Pingback: Heavy Rains : భారీ వర్షాలు.. ముంబైకి రెడ్ అలెర్ట్ జారీ - TRINETHRAM NEWS

Comments are closed.

You cannot copy content of this page

Scroll to Top