జూలై 25, 2026
TRINETHRAM NEWS
Heavy rain forecast

రెండు రోజుల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం.. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు

Heavy Rain : త్రినేత్రం న్యూస్ : అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది.

నేడు అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

వర్షాల సమయంలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో స్థానిక అధికారుల సూచనలు పాటించాలని కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page