తేదీ : 23/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్,); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉంగుటూరు నియోజకవర్గం, పెద నిండ్రకొలను గ్రామంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ లో భాగంగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈనెల ఇరవై నాలుగు వ తేదీ అనగా గురువారం విడుదల కాబోతున్న చిత్రం ఒక పోరాట యోధుడి చరిత్రను ఈ రాష్ట్రం, దేశంలోని ప్రజలందరికీ తెలియజేయడంతో పాటు రికార్డులు సృష్టించడం ఖాయం అని ఎమ్మెల్యే పత్స మట్ల. ధర్మరాజు అన్నారు.
అదేవిధంగా ఈ సినిమా విజయవంతం కావాలని కోరుతూ నిడమర్రు మండలం, మందలపర్రు గ్రామ శివాలయంలో ఈనెల పం తొమ్మి ది వ తేదీ అనగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. తెలుగు సినీ రంగంలో అగ్రశ్రేణి నటుడిగా, అదేవిధంగా పేదల కోసం నిరంతరం పోరాడి ప్రజా నాయకుడిగా ఎదిగారని అన్నారు. ప్రజాసేవకు అంకితమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన ర్యాలీలో పాల్గొని ఈ చిత్రాన్ని అభిమానులంతా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఐటీ వింగ్ కోఆర్డినేటర్ , మరియు నాలుగు మండలాల అధ్యక్షులు, ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


