Electricity Meter : తొలగించిన చోటే విద్యుత్ మీటర్ ఏర్పాటు చేయాలి

TRINETHRAM NEWS

తేదీ : 23/07/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు నియోజకవర్గం, యలమంచిలి మండలం, కనకయ్యలంక పంచాయతీ పరిధి డొల్ల వాళ్ల పేటకు చెందిన విజయలక్ష్మి ఇంటికి సంబంధించి విద్యుత్ మీటర్ తొలగించడం చాలా దారుణమని రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు వన్నేటి. పుష్పరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల పద్నాలుగు వ తేదీన పంచాయతీ కార్యదర్శి అనుమతితో విద్యుత్ మీటరు చేయడం జరిగింది.

కానీ కొన్ని రోజులకు కనీసం నోటీసు ఇవ్వకుండా తొలగించడం చాలా అన్యాయమని, అదేవిధంగా దళితులు అని చిన్న చూపు చూపుతున్న ప్రభుత్వ అధికారులు వైఖరిని మార్చుకోవాలని , ఎక్కడైతే మీటర్ తొలగించారో అదే స్థానంలో వేర్పాటు చేయకపోతే రానున్న రోజుల్లో మాల మహానాడు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా, నిరసన తెలియజేయడానికి ఏమాత్రం వెనకాడబోమని, పుష్పరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల జిల్లా అధ్యక్షులు నేతల . సాల్మన్ రాజ్, ఫినిష్. పెద్దిరాజు, గూటం. వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, సరేల్ల. రాజు, తేజ, గుడిసె. శ్రీను, పైడి .వెంకటేష్, పినిపే. ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Electricity meter should be

You cannot copy content of this page

Scroll to Top