తేదీ : 13/11/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణం సమీపంలో గల నరసాపురం నియోజకవర్గం లో శాసనసభ్యులు బొమ్మిడి . నాయకర్ సూర్య డిగ్రీ కళాశాలలో ఏపీ ఎస్ ఎస్ డిపి మరియు నేషనల్ కెరిర్ సర్వీస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ యువత కష్టపడి పనిచేస్తే తగిన గుర్తింపు వస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని తెలిపారు. ఈ జాబ్ మేళాలో సుమారు మూడు వందల డెబ్భై మంది అభ్యర్థులు పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా అనేకమంది సంబంధిత ఉద్యోగాలకు ఎంపికైనట్లు సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


