TRINETHRAM NEWS

ఘనంగా సావిత్రిభాయ్ పూలే జయంతి, ఆదర్శ విప్లవ స్త్రీ -సావిత్రి ఫూలే

త్రినేత్రం న్యూస్ ముత్తారం ఆర్ సి

తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త రచయిత్రి శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా

యుత తహశీల్దార్ పి. సుమన్ సావిత్రిబాయి ఫూలే పూలమాల వేస్తూ మాట్లాడుతూ
బహుజన సమాజంతో పాటు, అన్ని వర్గాల స్త్రీలు ఓనమాలు కూడా దిద్దలేని అజ్ఞానం, మూఢ నమ్మకాలు రాజ్యమేలుతున్న అంధకార యుగంలో సావిత్రి ఫూలే 1831వ సంవత్సరం జనవరి 3వ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నయగావ్‌ గ్రామంలో జన్మించారు.
బాల్యం నుండే సహజాతంగా అబ్బిన పట్టుదల, జిజ్ఞాస వంటి గుణాలు భర్త జ్యోతిరావ్‌ సాహచర్యంలో మరింతగా వికాసం చెందాయి.

మరాఠ ప్రాంతంలో పీష్వాల పాలన అంతమై, ఆంగ్లేయుల ఆధీనంలోకి వచ్చినా కూడా గ్రామాలలో ఆధిపత్య వర్గాల స్వభావం, పాలనా స్వరూపం మారలేదు.

1813 చార్టర్‌ చట్టము, 1835 మెకాలే విద్యా విధానంతో బ్రిటిష్‌ ప్రభుత్వం ఐరోపా విజ్ఞానం, శాస్త్రీయ విద్యల వ్యాప్తికి కృషి చేయడం ప్రారంభించింది.

ఫలితంగా కింది జాతుల ప్రజల విద్యావకాశాలకు ప్రొత్సహం లభించింది.

ఇట్టి కార్యక్రమములో నాయబ్ తహశీల్దార్ ఎండ్ షఫీ సీనియర్ సహాయకులు ఏ.భవానీ ప్రసాద్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App