బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .
దేవరకొండ డివిజన్ అక్టోబర్ 19 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. భక్తి, శ్రద్ధలతో సుఖ-సంతోషాలతో ఇంటిల్లిపాది దీపావళి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. అందరి బతుకుల్లో అలుముకున్న అజ్ఞానపు చీకట్లు వైదొలగాలని కోరారు. అందరి కుటుంబాల్లో దీపావళి దివ్య కాంతులు వెలగాలని కోరారు. మంచిపై చెడు సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారని అన్నారు. ప్రతీ ఒక్కరూ ఆయు రోగ్యాలతో, సుఖ సంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అందరి కష్టాలు వైదొలగాలని కోరారు.
దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా, మనో వికాసానికి, ఆనందానికి, సద్గుణానికి నిదర్శనంగా భావిస్తారని అన్నారు. అందుకే, దీపావళి రోజున లక్షీ దేవిని ఆరాధిస్తారని అన్నారు. దీపావళి అంటే దీపాల వరుస అని, దీన్ని రెండు రోజుల పాటు నిర్వహించుకుంటారని చెప్పారు. ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి…ఆశ్వయుజ బహుళ చతుర్ధశిని నరక చతుర్ధశిగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారిందన్నారు. ప్రతి శుభకార్యంలో ముందుగా జ్యోతిని వెలిగించి ప్రారంభిస్తారని ఆయన తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


