
కోర్టు పెట్టిన కండిషన్స్ ఇవే!
పవన్, నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యల కేసు
పోసానికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు
కేసు గురించి బహిరంగంగా మాట్లాడరాదన్న కోర్టు
Trinethram News : సినీ నటుడు పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు ఊరట కల్పించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులో కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో, ఆయన జైలు నుంచి విడుదలయ్యేందుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి.
పోసానికి కోర్టు విధించిన షరతులు ఇవే:
రూ. 2 లక్షల విలువతో ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు ఇవ్వాలి.
జైలు నుంచి విడుదలైన తర్వాత దేశం విడిచి వెళ్లరాదు.
కేసు గురించి ఎక్కడా బహిరంగంగా మాట్లాడకూడదు. మీడియాతో కూడా మాట్లాడకూడదు.
పత్రికలకు ప్రకటనలు ఇవ్వరాదు.
నాలుగు వారాల పాటు ప్రతి మంగళ, గురువారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపు మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి వచ్చి సంతకం చేయాలి.
కేసు దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
