త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 20: నెల్లూరు జిల్లా: కావలి… నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలోని పాతూరు శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన తెప్పోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.భక్తుల జయజయధ్వానాల మధ్య స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన తెప్పపై తీర్థంలో విహరింపజేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో అలంకరించబడగా, భారీ సంఖ్యలో భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి , పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పాతూరు శివాలయం ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందని, ఇలాంటి ఉత్సవాలు భక్తులలో భక్తి భావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. కావలి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఐశ్వర్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.ఆలయ అర్చకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


