ఆగస్ట్ 20, 2026
TRINETHRAM NEWS
Gautami Bold Decision!

Gautami Bold Decision : త్రినేత్రం న్యూస్ : నిజం న్యూస్ | ఖమ్మం | ఆగస్టు 4 : ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు గౌతమి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో ప్రైవేట్ విద్యాసంస్థల అడ్మిషన్ల ప్రమోషన్‌కు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వివాదంలో ఆరు నెలల పాటు సస్పెన్షన్‌కు గురైన ఆమె, ఇటీవలే తిరిగి విధుల్లో చేరారు.

అయితే విధుల్లో చేరిన తర్వాత తోటి ఉద్యోగుల నుంచి ట్రోలింగ్, మానసిక వేధింపులు ఎదుర్కొంటున్నానని పేర్కొంటూ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనపై కఠిన చర్యలు తీసుకోవడం, అనంతరం ఎదురైన పరిస్థితులు తీవ్ర మానసిక వేదనకు గురిచేశాయని గౌతమి భావోద్వేగంతో వెల్లడించారు.

ఈ పరిణామం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె రాజీనామాపై విద్యాశాఖ అధికారులు ఎలా స్పందిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page