మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలి ప్రధాన కార్యదర్శి ఏల్పుల ధర్మరాజు
హనుమకొండ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 24 డిసెంబర్ 2024
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులకు కనీస వేతనాలు పెంపు, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఇతర సమస్యలు పరిష్కరించడం కోసం హనుమకొండలోని బాలసముద్రంలో గల ఏఐటియుసి జిల్లా కార్యాలయంలో మంగళవారం రోజున వేల్పుల సారంగపాణి అధ్యక్షతన వహించారు. తెలంగాణ రాష్ట్ర స్టాప్ అండ్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయుసి, అనుబంధం) హనుమకొండ జిల్లా సమితి అత్యవసర కార్యవర్గ సమావేశం జరిగినది. సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మున్సిపల్ స్టాప్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్, అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి వేల్పుల సారంగపాణి, ఏల్పుల ధర్మరాజు మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పనిచేస్తున్న పారిశుధ్య, ఔట్ సోర్సింగ్ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారు అని వీరికి కనీస వేతనం నెలకు 26వేల రూపాయల అమలు చేయాలనీ వేతనం నేరుగా రాష్ట్ర ప్రభుత్వం వీరి ఖాతాల్లో జమ చేయాలనీ, ప్రమాద భీమా 5 లక్షలు,
మరణ మట్టి ఖర్చులు 30 వేల రూపాయలు, మరణించిన (లేదా) ఉద్యోగ విరమణ పొందిన వారి కుటుంబానికి ఎలాంటి ఆంక్షలు లేకుండా 30 రోజుల్లో పని కల్పించాలి ,అదేవిధంగా మున్సిపల్ డ్రైవర్లు స్వచ్ఛభారత్ ఆటోల కార్మికుల సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని అనేకసార్లు కమిషనర్ దృష్టికి కార్మిక సమస్యలు తీసుకపోయినప్పటికీ ఈరోజు కూడా సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతున్నారని ఉద్యోగంలో పనిచేస్తూ అనారోగ్యంతో గురై మరణించిన కార్మికుల కుటుంబాల సభ్యులకు వెంటనే ఉద్యోగం కల్పించాలని ప్రైవేట్ జవాన్లను పారిశుద్ధ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి బొక్క ఏలియా, యాదమ్మ, కోశాధికారి ఏ.ఎల్లస్వామి, ఉపాధ్యక్షులు ఎస్కే షమీం, కార్యదర్శి నాగుల శ్రీకాంత్, మున్నంగి రఘు, కుమార్, రాజేందర్ , కే.లక్ష్మి , దేవేందర్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App