IMG 20241019 WA0027
మనపురంలో బంగారం మాయం
Trinethram News : వికారాబాద్ జిల్లా ప్రతినిధి, త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ పట్టణంలో మనప్పురం గోల్డ్ బ్రాంచ్ లో గోల్డ్ మాయం. గోల్డ్ లోన్ లో కస్టమర్లు దాచుకున్న బంగారం ఎత్తుకెళ్లిన బ్రాంచ్ మేనేజర్ విశాల్. ఆందోళన చెందుతున్న కస్టమర్లు, మనపురం గోల్డ్ కార్యాలయంలో కస్టమర్ల హంగామా.
సుమారు మూడు కోట్ల 25 లక్షలు విలువ ఉన్నట్టు సమాచారం. మూడు కేజీల బంగారం ఎత్తుకెళ్లాడని మనపురం సిబ్బంది వివరణ.
బ్రాంచ్ కు చేరుకొని సిబ్బందిని నిలదీస్తున్న కస్టమర్లు. మూడు కేజీల బంగారం ఎత్తుకెళ్లాడని మనపురం సిబ్బంది వివరించారు.
