జూన్ 26, 2026
TRINETHRAM NEWS
goats killed in Poliguda

Goats Killed : అరకులోయ జూన్ 4, (త్రినేత్రం న్యూస్): మండలంలోని లోతేరు పంచాయతీ పరిధి పొలిగూడ గ్రామంలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం సమయంలో పిడుగు పడటంతో 8 మేకలు మృతి చెందాయి. గ్రామస్తుల వివరాల ప్రకారం, ఎప్పటిలాగే మేకలను కొండపై మేతకు తీసుకెళ్లగా ఆకస్మికంగా పిడుగు పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
పిడుగుపాటుకు బట్నాయక్ భాస్కర్‌కు చెందిన మూడు మేకలు, బట్నాయక్ శ్రీరాములుకు చెందిన రెండు మేకలు, కేరంగి చంపకు చెందిన మూడు మేకలు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మేకల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆదివాసీ కుటుంబాలకు ఈ ఘటనతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందన్నారు.
ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ, పిడుగుపాటుకు మేకలను కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకుని తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఘటనపై పశుసంవర్ధక శాఖ, రెవెన్యూ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించి ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామానికి చెందిన సుబ్బారావు, రామచందర్‌తో పాటు ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page