జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 31 at 12.25.43 PM

TRINETHRAM NEWS

Trinethram News : రాజశ్రీ కడప జిల్లా SP శ్రీ సిద్ధార్థ్ కౌశల్ IPS గారు మరియు SDPO, మైదుకూరు i/c ప్రొద్దుటూరు వారి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీసు G. ఇబ్రహీం గారు, ప్రొద్దుటూరు SEB ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్ లు తమ సిబ్బందితో పాటు 30.01.2024వ తేది మధ్యాహ్నం నుండి ప్రొద్దుటూరు టౌన్, జమ్మలమడుగు మైదుకూరు బైపాస్ రోడ్డుపై గల KHM కళ్యాణ మండపము వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా మధ్యాహ్నం 2.30 గంటల సమయములో ఖాళీ కూరగాయల బాక్సుల మాటున అధిక ధరలకు అమ్ముకొనుటకు గాను అక్రమముగా పెద్ద ఎత్తున గోవా రాష్ట్రముకు చెందిన మద్యంను రవాణాచేస్తూ జమ్మలమడుగు వైపు నుండి ఒక ఐచర్ వాహనము రాగా దానిని ఆపి తనిఖీ చేసి, అక్రమ మద్యంను రవాణా చేస్తుండిన ఐదుగురిని అదుపులోనికి తీసుకొని వారి నుండి ఒక ఐచర్ లారీని మరియు సుమారు రూ. 12,52,000/-లు విలువ చేసే 750 ML పరిమాణము గల 1252 బాటిళ్ళను స్వాధీన పరుచుకోవడము జరిగినది.

You cannot copy content of this page