Employment Guarantee : ఉపాధి హామీ కూలీ డబ్బులు ఇవ్వండి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ సల్బత్తాపూర్ గ్రామస్తుల ఆవేదన. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని చేసిన కూలీలకు వేతనాలు మాజురు చెయ్యండని, వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఉపాధి కూలీలు మాట్లాడుతూ,ఏప్రిల్ మొదటి వారం నుండి ప్రారంభమయిన ఉపాధి హామీ పథకం పనులు, మే చివరి వారంలో ముగిసింది. కానీ ఇంతవరకు 8 వారాలు గడిసిన కూడా ఒక్క వారం డబ్బులు కూడా రాలేవు, జీవనం గడుపుటకు ఇబ్బంది కరంగా ఉందని, అదేవిదంగా పొలాల్లో వ్యవసాయ పనులు సాగించే సమయం కావున, దయచేసి డి ఆర్ డి ఏ అధికారులు తగు చొరవ తీసుకొని ఉపాధి కూలీ డబ్బులు మంజురు చేయించగలరని ప్రాధేయ పడుతున్నారు, లేని పక్షంలో, గ్రామం నుండి వలస వెళ్లే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Give the employment guarantee

You cannot copy content of this page

Scroll to Top