తేదీ : 24/092025. అనకాపల్లి జిల్లా: (త్రినేత్రం న్యూస్); దేవరపల్లి మండలం, రైవాడా కాలువ వద్ద భారీ గిరి నాగు ప్రత్యక్షమైంది. స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. గ్రామస్తులు పరుగులు తీయగా , పాము పట్టే వ్యక్తి కృష్ణ అక్కడికి చేరుకొని ఆ పామును పట్టుకునేందుకు ప్రయత్నించాడు ఆ సమయంలో నాగుపాము రివర్స్ ఎటాక్ చేయడానికి ప్రయత్నించగా , ఆయన అప్రమత్తంగా వ్యవహరించాడు. సుమారు రెండు గంటలపాటు శ్రమించిన తర్వాత చివరికి ఆ పామును సురక్షితంగా బంధించగలిగాడు. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


