సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Ghat Road Closure

Ghat Road Closure : యన్ టి ఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 22 ; జిల్లా కేంద్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో అత్యవసర మరమ్మతులు సంబంధిత అధికారులు చేపట్టారు. దీని కారణంగా వారం రోజులపాటు వాహనాల రాకపోకలను, కాలినడక ప్రయాణాలను నిషేధించారు. వివో సినా నాయక్ ఈ విషయాన్ని తెలిపారు.

అయితే భక్తులు కనకదుర్గ నగర్ మీదుగా కొండపైకి వెళ్లాలని సూచించారు. హైదరాబాదు నుంచి వచ్చే వాహనాలను పున్నమి ఘాట్ వద్ద , విశాఖ మరియు చెన్నై నుంచి వచ్చే వాహనాలను సీతమ్మ పాదాల వద్ద పార్కింగ్ చేయాలని వెల్లడించారు. అక్కడి నుండి ఆ గుడికి చేరుకోవడానికి ఆలయ యంత్రాంగం ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page