గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి సంస్థ జీడికే వన్ గ్రూప్ పరిధిలో హౌస్ కీపింగ్ పనులు చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు గత గత రెండు నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదని వెంటనే ఇప్పించాలని కోరుతూ ఆర్ జి వన్. జిఎం లలిత్ కుమార్ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ సి సి డబ్ల్యూ యు (ఐ ఎఫ్ టీ యు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న మాట్లాడుతూ సింగరేణి ఆర్ జీవన్ గ్రూప్ పరిధిలో జూల సాయిరాం అనే కాంట్రాక్టర్ వద్ద హౌస్ కీపింగ్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సంబంధిత కాంట్రాక్టర్ సకాలంలో వేతనాలు చెల్లించక పోవడం వల్ల కార్మికులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారనీ.
ప్రతి నెల లేటుగా ఒక్కోసారి రెండు, మూడు నెలలు అవుతుందనీ ఆలస్యం అవడం వల్ల కార్మికులు ఆర్థికంగా నష్టపోతురని సకాలంలో జీతాలు రాక అప్పుల పాలవుతున్నారని అన్నారు ఈ పరిస్థితులలో కాంట్రాక్టు కార్మికులు వారి కుటుంబాలను పోషించుకోలేక అనేక అవస్థలు పడుతున్నారు ఈ కార్మికులు నిరుపేద కుటుంబాల కు చెందిన వారు. జీతం వస్తే కానీ పూటగడవని పరిస్థితినీ ఎదుర్కొంటున్నార నీ అన్నారు కాబట్టి ఈ కార్మికుల కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని జూల సాయిరాం అనే కాంట్రాక్టర్ పై తగిన చర్య తీసుకోని కార్మికులకు ప్రతినెల ఏడవ తారీకు లోపు జీతాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో ఐ ఎఫ్ టీ యు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి అశోక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఐ రాజేశం లు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


