అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ (పాడేరు) మే 17: ఉగ్రవాద నిర్మూలనలో భారత్ చేపట్టిన విశిష్ట యుద్ధ కార్యాచరణ “ఆపరేషన్ సిందూర్” లో పాల్గొన్న త్రివిధ దళాల వీరులకు సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా తిరంగ యాత్రలు నిర్వహించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు పాడేరు నియోజకవర్గంలో మే 17న శనివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు భారీ స్థాయిలో తిరంగ యాత్ర నిర్వహించనున్నారు.
జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. త్రివిధ దళాల శౌర్యాన్ని, వీర మహిళల త్యాగాలను గౌరవించేందుకు, దేశ సమగ్రతకు సంఘీభావంగా నిలిచేందుకు ప్రతి జనసైనికుడు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ పిలుపునిచ్చింది.
ఈ యాత్రలో జిల్లా కమిటీ నాయకులు, మండల అధ్యక్షులు, జనసైనికులు, వీర మహిళలు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు. కార్యక్రమానంతరం మధ్యాహ్నం 1 గంటకు భోజన విందు ఏర్పాటు చేయబడి, అనంతరం ప్రతి ఒక్కరూ తమ స్వస్థలాలకు తిరుగు ప్రయాణం కానున్నారు.
ఈ మేరకు జనసేన పార్టీ పాడేరు నియోజకవర్గం మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జి వంపూరు గంగులయ్య మీడియా ప్రకటనలో తెలియజేశారు. దేశభక్తి, శౌర్యానికి అద్దం పడే ఈ యాత్రలో ప్రతి ఒక్కరికి పాల్గొనే బాధ్యత ఉందని వంపూరు గంగులయ్య అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


