జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 19 at 16.32.46

TRINETHRAM NEWS

సమాచార హక్కు చట్టం సాధన కమిటీ తెలంగాణ రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా గంగా రజినీ ప్రియ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక

హైదరాబాద్:-
సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ అధ్యక్షులు చంటి ముదిరాజ్ మరియు తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సూర స్రవంతి మంగళవారం గంగా రజినీ ప్రియ రెడ్డి కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రియ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా నియమించిన జాతీయ అధ్యక్షులు చంటి ముదిరాజ్ కు మరియు తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సూర స్రవంతి కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రియ రెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల నుంచి సహకారం లభించడం లేదన్నారు. అధికారుల్లో జవాబుదారితనం కొరవడిందన్నారు. సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో ఆ వ్యక్తికి కోరిన సమాచారం అందించాల్సిన బాధ్యత ఆయా అధికారులపై ఉందన్నారు. నిర్ణీత సమయంలోపు అందించకపోతే అప్పిలేట్ అధికారికి అప్పీల్ చేసుకోవచ్చన్నారు. ఇక్కడా స్పందన రాకపోతే రాష్ట్ర సమాచార చట్టం చీఫ్ కమిషనర్ కు అప్పీల్ చేసుకోవాలన్నారు. కమిషన్ స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటుందన్నారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును నిరాకరించే అధికారం ప్రభుత్వ వ్యవస్థలో ఏ శాఖ, అధికారికి లేదన్నారు. సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి బయటకు తీస్తూ సమాచార హక్కు చట్టం గురించి పౌరులకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గుండెల రాయుడు, బత్తుల మహేష్ గౌడ్, కట్ట యాదగిరి ముదిరాజ్,నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page