జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
రంగారెడ్డి జిల్లా ఆగస్ట్ 22. గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ ఘనంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనము సమావేశ మందిరంలో గణేష్ చతుర్థి ఉత్సవాల ఏర్పాట్ల పై డిసిపిలు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనరులు, పోలీస్ అధికారులు, గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 27న వినాయకచవితి ఉత్సవాలు ప్రారంభమై సెప్టెంబర్ 6న నిమజ్జనం చేయన్నునందున, వినాయక మండపాలు ఏర్పాటు చేసే భక్తులు, నిర్వాహకులు భక్తి శ్రద్దలతో సురక్షిత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి మండపాల నిర్వాహకులు తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. జిల్లాలో గణేష్ నిమజ్జనం నిర్వహించేందుకు 44 చెరువులను గుర్తించినట్లు తెలిపారు. గణేష్ శోభాయాత్ర నిర్వహించే దారిలో గుంతలు పడిన రహదారులు, ప్యాచ్ వర్క్ రిపేర్ పనులు, గణేష్ నిమజ్జనం నిర్వహించే ప్రదేశాల వద్ద క్రెన్లు, బారికేడింగ్, వేదిక ఏర్పాట్లు మున్సిపల్, ఆర్ అండ్ బి శాఖ అధికారులు కలసి చేపట్టాలని, అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ప్రణాళిక రూపొందించుకొని సమన్వయముతో పని చేయాలని సూచించారు.
ముఖ్యంగా విద్యుత్ అంతరాయం కలగకుండా నిరంతరం విద్యుత్ సరఫరా కొనసాగించాలని, సమస్యలు ఎక్కువగా ఉన్నచోట భారీ బందోబస్తూ కల్పించాలని, సిసి కెమెరాలు ఏర్పాట్లు చేయాలని, భారీ కేడింగ్, బందోబస్త్, మెడికల్, సానిటేషన్, కంట్రోలింగ్ రూం తదితర ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. నంబరింగ్ ఇచ్చిన మండపాల దగ్గర పరిశుభ్రత పాటించాలని, మండపాల దగ్గర ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని, ఫాగింగ్, సానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యుత్ కు సంబంధించి ఫోల్స్ అవసరమున్నచోట ఏర్పాటు చేయాలని, లోహ్యాంగింగ్ వైర్స్ ని సరి చేయాలని అన్నారు. విగ్రహాలు ఊరేగింపు సమయంలో వాహనాల్లో ఎటువంటి యాంత్రిక సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని, నిమజ్జనం సమయంలో వేలాడే తీగలు, వంగి ఉన్న చెట్లు, తదితర వాటిని తొలిగించాలని తెలిపారు. చెరువుల వద్ద క్రేన్ లను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
చెరువుల వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలి సూచించారు.
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేసేలా, నిమజ్జనం సమయంలో చెరువుల వద్ద అవసరమైన క్రేన్లు ఏర్పాటు చేయాలని, విద్యుత్ అంతరాయం లేకుండ విద్యుత్ సరఫరా చేయాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండ ఏర్పాట్లు చేపట్టేలా అధికారులకు సూచనలు చేయాలని కలెక్టర్ గారిని కోరడం జరిగినది .
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, మహేశ్వరం డిసిపి సునితా రెడ్డి, ఎల్బీనగర్ డిసిపి ప్రవీణ్ కుమార్, శంషాబాద్ అడిషనల్ డిసిపి కె. రామ్ కుమార్, మాదాపూర్ అడిషనల్ డిసిపి సాయిరామ్, ఆర్డీఓలు అనంత రెడ్డి, చంద్రకళ, సరిత, జగదీశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనరులు, పోలీస్ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


