Gandhi Jayanti : ఘనంగా గాంధీ జయంతి

TRINETHRAM NEWS

తేదీ : 02/10/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఏలూరులో జాతీపిత మహాత్మా గాంధీ నూటయాబై ఆరు వ జయంతి సందర్భంగా ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్(ఏఐటీయు సీ అనుబంధం) ఆధ్వర్యంలో కోటిదిబ్బ ఆర్ ఒకటి వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రెడ్డి. శ్రీనివాస్ డాంగే, ఉపాధ్యక్షులు బండి. వెంకటేశ్వరరావు , నాయకులు పి. కిషోర్, జోనల్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి ఎ. అప్పలరాజు మాట్లాడుతూ గాంధీ గురించి వివరించారు. భారతదేశ స్వతంత్రం కోసం మహాత్మా గాంధీ శాంతియుత పోరాటం నిర్వహించారని కొనియాడారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Gandhi Jayanti

You cannot copy content of this page

Scroll to Top