WhatsApp Image 2024 02 20 at 17.15.45
Trinethram News : గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గల్లా మాధవి పేరు తెరపైకి వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మంత్రి విడదల రజని పేరును ఖరారు చేసింది.
ఈ నేపథ్యంలో అక్కడ కూడా బీసీ అభ్యర్థిని ప్రకటించాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు సమాచారం. అందుకే గల్లా మాధవి పేరును ఆయన ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు కూడా ఈ పేరుకు ఓకే చెప్పినట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
గ్రౌండ్ వర్క్ ప్రారంభించిన…ఇప్పటికే గల్లా టీం గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. బీసీ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు ఢీ అంటే ఢీ గా పోటీకి సిద్ధమవుతున్నారు. రాత్రికి రాత్రి ఫోటోలు లేకుండా గుంటూరు నగరంలో వెలిసిన ప్లక్సీలు పశ్చిమ నియోజకవర్గం టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ఈ నియోజకవర్గం టిక్కెట్ కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులు మాత్రం నిరాశకు లోనవుతున్నారు. అదే నిజమయితే మాత్రం ముఖ్యమైన నేతలు రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
