ఆగస్ట్ 18, 2026
TRINETHRAM NEWS
Free medical camp

Free Medical Camp : గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం. పెనుమూరు. (జులై 28).మహర్షి అభ్యుదయ సేవా సంస్థ మాస్ తిరుపతి జ్ఞాన శేఖర్ రెడ్డి వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర అరవింద కంటి ఆసుపత్రి తిరుపతి మరియు చిత్తూరు జిల్లా అందత్వ నివారణ శాఖ వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పెనుమూరు మండలం ఉగ్రాణం పల్లి గ్రామం ధర్మరాజులు గుడి ఆవరణలో ఈరోజు మంగళవారం ఉదయం 9గo,నిర్వహించబడినది.
ఈ కార్యక్రమానికి పెనుమూరు మండలం ఉగ్రణoపల్లె చుట్టుపక్కల గ్రామాల నుండి సుమారు 210 మంది హాజరు అయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అరవింద్ ఐ హాస్పిటల్ డాక్టర్ అలేఖ్య మరియు చిత్తూరు జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ సుబ్రహ్మణ్యం రెడ్డి మరియు ఉగ్రహణంపల్లి మాజీ సర్పంచ్ మురళి మరియు మహర్షి అభ్యుదయ సేవా సంస్థ అధ్యక్షులు కే.జ్ఞాన శేఖర్ రెడ్డి పాల్గొనడం జరిగినది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ మా సంస్థ అనేక ప్రదేశాలలో ఆంధ్రప్రదేశ్ లో అనేక సోషియల్ డెవలప్మెంటల్ ఆక్టివిటీస్ లో ముందు వరుసలో ఉంటుందని, అనేక అవార్డులు, రివార్డులు తీసుకున్న మంచి గుర్తింపు ఉన్న సంస్థ ఇలాంటి చిన్న పల్లెటూర్లలో ఇలాంటి హెల్త్ క్యాంపు నిర్వహించి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించడం హర్షించదగ్గ విషయమని సంస్థను కొనియాడారు. సర్వంధియానా నయనం ప్రధానం అన్నదానికి సరైన నిర్వచనం అని మాస్ సంస్థను అభినందించారు.

అనంతరం సంస్థ అధ్యక్షులు జ్ఞాన శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు జరిగిన ఐ క్యాంపులో 30 మందికి కంటి సమస్య ఉన్నట్లుగా గుర్తించి, వీరిని ఆపరేషన్ నిమిత్తం తిరుపతి అరవింద్ హాస్పిటల్ కి ఉచితముగా బస్సులో తీసుకుని వెళ్లి ఉచితంగా ఆపరేషన్ చేయించి తిరిగి 30వ తేదీ మధ్యాహ్నం ఉగ్రహణం పల్లెలో దించగలమని సంస్థ అధ్యక్షులు కే జ్ఞాన శేఖర్ రెడ్డి తెలియజేశారు.మాస్ సంస్థ గత 20 సంవత్సరము లలో దాదాపుగా 40 హెల్త్ క్యాంపులు నిర్వహించినట్లు మాస్ అధ్యక్షులు జ్ఞాన శేఖర్ రెడ్డి తెలియజేశారు. అంతేకాకుండా అనేక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మరియు ఉచిత ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగినదని తెలిపారు.
ఈ క్యాంపులో ఉచిత వైద్య శిబిరము నందు,దగ్గర చూపు దూరపు చూపు సమస్యలు కంటి పొర, శుక్లము ఉన్న వారిని గుర్తించి చికిత్సలు చేయడం జరిగినది. ఉచిత భోజనము వసతి సౌకర్యం కల్పించి, కంటి ఆపరేషన్ చేసి వారి స్వస్థలములలో 30వ తేదీ దించగలము.ఈ కార్యక్రమంలో జయచంద్ర నాయుడు, కనకరాజుల రెడ్డి, సుబ్రహ్మణ్యం నాయుడు, మరియు తిరుపతి రమణ, నరేష్ నాయక్ తదితరులు పాల్గొనడం జరిగినది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page