
JD Dr. Ramesh : డిండి (గుండ్ల పల్లి)జులై 28 ,త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో దేవరకొండ నియోజకవర్గంలోని డిండి మండలంలోని గోనకోలు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన నల్లగొండ జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ, ఎల్ ని నో ప్రభావంతో వర్షపాతం అతి తక్కువగా ఉండడంతో, రైతులు పాడి పరిశ్రమపై దృష్టి కేంద్రీకరించి పాడి గేదెలను, ఆవులను విరివిగా పెంచుకొని తద్వారా పాల ఉత్పత్తిని పెంచుకొని, ఆర్థిక లాభాలు గడించాలని ఆయన పిలుపునిచ్చారు.
పాడి పశువులకు తగిన మేతను అందించాలని , ఆడ దూడల పెంపకం కృషి చేయాలని పాడి రైతులకు పిలుపునిచ్చారు .పాడి రైతులకు గడ్డి విత్తనాలు దాన తదితర వాటిని ప్రభుత్వం 75% సబ్సిడీ ద్వారా రైతులకు అందజేస్తుందని డాక్టర్ రమేష్ తెలిపారు అగ్రికల్చర్ డౌన్ ఫాల్ దృష్ట్యా ,పాడి పరిశ్రమలను ప్రత్యామ్నాయంగా ఎంచు కోవాలని ,తద్వారా పాడి రైతులు తమ జీవన విధానాన్ని మార్చుకొని సమాజానికి నాణ్యమైన పాలను అందించాలని తెలిపారు .
ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ డైరెక్టర్ డాక్టర్ వంగాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, శాస్త్రవేత్తలు ఎల్ ని నో పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్న దృష్ట్యా , రైతులు ప్రత్యామ్నాయంగా పాడి పశువులపై శ్రద్ధ వహించి ,పాల ఉత్పత్తిని పెంచి తద్వారా లాభం పొందాలని సూచించారు. అదేవిధంగా పశువైద్యాధికారులు డాక్టర్ ధనలక్ష్మి డాక్టర్ నాగయ్య, రైతులకు తగిన సలహాలు సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి గోనకోల్ సర్పంచ్ కోసిరెడ్డి రాజేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులైన నల్లగంతుల రవి ,తేజు నాయక్ ,విజయేందర్ రెడ్డి, శ్రీనివాస్ ,రాములు ,పాడి రైతులు గుర్రం రాములు, దుబ్బా రాకేష్ రెడ్డి, కామేపల్లి నిరంజన్ ,చంద్యా నాయక్ ,శివ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి ,జైపాల్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, లక్ష్మయ్య, లతో పాటు 50 మంది పాడి రైతులు పాల్గొన్నారు .
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe