జూలై 23, 2026
TRINETHRAM NEWS
RS Praveen Kumar

షేక్ ఇస్మాయిల్. బి ఆర్ ఎస్ యువజన నాయకులు.

RS Praveen Kumar : దేవరకొండ డివిజన్ జూన్ 28, త్రినేత్రం న్యూస్. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్‌ అధికారి డాక్టర్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ భద్రతను తగ్గించడం ఆందోళన కలిగించే విషయమని బీఆర్‌ఎస్‌ యువజన నాయకులు షేక్ ఇస్మాయిల్ పేర్కొన్నారు.

26 సంవత్సరాల పాటు ఐపీఎస్ అధికారిగా దేశానికి సేవలందించడంతో పాటు, గురుకుల విద్యాసంస్థల ద్వారా వేలాది మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తికి భద్రతను తగ్గించడం సముచితం కాదని ఆయన అన్నారు.

ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపై డాక్టర్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ నిరంతరం తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయన భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. గతంలో తనకు ప్రాణహాని ఉందని ఆయన వెల్లడించిన విషయాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత అని, ప్రతిపక్ష నాయకుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకూడదని షేక్ ఇస్మాయిల్ అన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి, డాక్టర్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ కి తగిన భద్రతను పునరుద్ధరించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page