జూలై 13, 2026
TRINETHRAM NEWS
Former State Greening and Beautification

మరియు గోపాలపురం వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) శ్రీ చందన నాగేశ్వర్..

Former State Greening : త్రినేత్రం న్యూస్… పొట్టిలంక శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి 6వ వార్షికోత్సవంలో పాల్గొన్న చందన నాగేశ్వర్… పొట్టిలంకలో శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి 6వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథులుగా చందన నాగేశ్వర్, వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, మాజీ డిసిసిబి బ్యాంక్ చైర్మన్ ఆకుల వీర్రాజు పాల్గొన్నరు,
శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు చందన నాగేశ్వర్ ని సాదరంగా ఆహ్వానించి శాలువా కప్పి సత్కరించారు.ఈ సందర్భంగా చందన నాగేశ్వర్ మాట్లాడుతూ..హనుమాన్ జయంతి సందర్భముగా శుభాకాంక్షలు తెలిపారు.అసమానమైన శక్తికి, భక్తికి, నిస్వార్ధ సేవకు ప్రతీకైన ఆ ఆంజనేయుని కరుణా కటాక్షాలు భక్తులకు ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు.
పొట్టిలంకలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి 6వ వార్షికోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమిరెడ్డి నాగేంద్ర, పొట్లంక మాజీ సర్పంచ్ వెంకన్న, అభయ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు,వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు, పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page