జూలై 17, 2026
TRINETHRAM NEWS
Education Week Celebrations

చెరుకుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన తహసీల్దార్ శ్రీనివాస్ గౌడ్.

Education Week Celebrations : డిండి (గుండ్లపల్లి), మే 12, త్రినేత్రం న్యూస్ . డిండి మండల వ్యాప్తంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలలో భాగంగా రెండోరోజు మంగళవారం చెరుకుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను స్థానిక తహసీల్దార్ హనుమంతు శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యా వారోత్సవాల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయవచ్చని తహసీల్దార్ పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక వికాసం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఇస్లావత్ గోప్య నాయక్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వారోత్సవాల సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభను తహసీల్దార్ శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page