జూన్ 26, 2026
TRINETHRAM NEWS

కాలనీలో చెడిపోయిన బోర్లకు మరమ్మతులు చేయించిన మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : రామగిరి మండలం ముస్త్యాల గ్రామం ఎస్సీ కాలనీలో రెండు బోర్లు చెడిపోవడంతో కాలనీ వాసులు మంచినీటికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై తాజా మాజీ సర్పంచ్ రామగిరి లావణ్యని బోర్లు మరమ్మత్తులు చేయించమని అడగగా మానవతా దృక్పథంతో సానుకూలంగా స్పందించి పదవి ఉన్నా లేకున్నా గ్రామ సేవే నా లక్ష్యం అని మరమ్మతులు చేయించి కాలనీవాసుల మన్ననలు పొందారు. లావణ్య మాట్లాడుతూ నేను పదవిలేని కాలంలోనే ప్రజాసేవ చేశానని ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకొన్నానని అలాగే నాకు పదవి ఉన్నా లేకున్నా, నేను గ్రామ సేవ చేయడంలో ముందు ఉంటానని అన్నారు. ముందు ముందు గ్రామ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటానని అన్నారు. బోర్లు మరమ్మతులు చేయించడం పై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former Sarpanch who quenched

You cannot copy content of this page