Chander meets KCR : కేసీఆర్ ను కలసిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్

TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణ రైతంగాన్ని కంటికి రెప్పలగా చూసింది కేసీఆర్‌ అని వారి పాలనలో తెలంగాణ రైతులంతా రాజులుగా బతికారన్నారని రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. రైతులకు ఎవరు ఏం చేశారో చర్చిద్దామన్న రేవంత్ ఛాలెంజ్‌ను స్వీకరించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాదు సోమజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చ చేద్దామన్నా నేపథ్యంలో మంగళవారం హైదరాబాదు లో తొలి సిఎం కేసీఆర్ రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ కలిసారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాతలకు అండగా నిలిచింది కేసీఆర్‌ మాత్రమే అన్నారు. రెవంత్ పాలనలో రైతులకు చేసింది ఎమి లేదన్నారు. యావత్తూ తెలంగాణ ప్రజలంతా కేసీఆర్‌ పాలనను తిరిగి కోరుతున్నారన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former MLA Korukanti Chander

You cannot copy content of this page

Scroll to Top