డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి ప్రజలకు సూచించారు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మంగళ వారం రామగుండం నగర పాలక సంస్థలో నూతనంగా విలీనమైన ఎల్కలపల్లి గేట్ ప్రాంతoలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ స్టిక్కర్లు అంటించారు ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ దోమల నివారణకు రామగుండం నగర పాలక సంస్థ చేస్తున్న స్ప్రే , ఫాగింగ్ , ఆయిల్ బాల్స్ వేయడం తదితర కార్యక్రమాల గురించి వివరించారు. ప్రజలు కూడా దోమ తెరలు వాడడం , కిటికీలకు జాలీలు అమర్చుకోవడం చేయాలని అన్నారు. ఆ తరువాత శివాజీ నగర్ కూరగాయల మార్కెట్ లోని మరుగు దొడ్డి నిర్వహణను పరిశీలించారు.
గాంధీ చౌరస్తా నుండి రామాలయం రోడ్డులో వ్యాపారులకు ట్రేడ్ లైసెన్స్ పై అవగాహన కల్పించారు. రీగల్ షూ మార్ట్ రోడ్డులో వీధి వ్యాపారులకు పి ఎం స్వనిధి పథకం ప్రయోజనాలను వివరించారు. గంగా నగర్ లోని రంగనాధ స్వామి ఆలయ ఆవరణలో జరుగుతున్న వాల్ ఆర్ట్ పరిశీలించారు. అనంతరం పి కె రామయ్య కాలనీ లో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు ఈ కార్యక్రమాల్లో సానిటరీ ఇన్స్పెక్టర్లు నాగ భూషణం , కిరణ్ , కుమార స్వామి హెల్త్ అసిస్టెంట్ సంపత్ వార్డు అధికారులు సాయి గంగయ్య , శ్రీనివాస్ , కమ్యూనిటి ఆర్గనైజర్లు శ్వేత , శమంత , ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


