సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు
Trinethram News : సంగారెడ్డి : ఎన్నికల్లో డమ్మీ హామీలు ఇచ్చినట్టు ముఖ్యమంత్రి రుణమాఫీ డమ్మీ చెక్కులు ఇస్తున్నారా రేవంత్ రెడ్డి?
మీరు ఇచ్చిన రుణమాఫీ చెక్కు ఈరోజు వరకు ఎందుకు రైతుల ఎకౌంట్లో డబ్బులు పడలేదు?
పండుగకు ఊరికి వెళుతున్నవారు గ్రామాల్లో చర్చ పెట్టాలని కోరుతున్నాను
రాష్ట్రంలో ఎకరం లోపు భూమి ఉన్న రైతులు 24 లక్షల 57,000 మంది ఉన్నారు
ఇందులో ఎక్కువ శాతం దళితులు, గిరిజనులు, బీసీలు మాత్రమే ఉన్నారు
దళిత, గిరిజన, బీసీ రైతుల కడుపు కొట్టడమేనా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా?
కోటి మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. కూలీల కడుపు కొట్టేందుకు మీకు చేతులు ఎలా వచ్చాయి?
కోటి మంది వ్యవసాయ కూలీలు ఉంటే పది లక్షల మందికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామంటున్నారు
90 శాతం ఎగ్గొడుతున్నారు. రకరకాల కారణాలతో కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు
మట్టిపనికి వెళ్లే 90 లక్షల మంది రైతు కూలీలకు పథకం ఎగ్గొట్టడం దుర్మార్గం
బహిరంగ చర్చకు సిద్ధం. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. మధిరకు రమ్మంటారా, సెక్రటేరియట్‌కి రమ్మంటారా? ప్రగతి భవన్‌కి రమ్మంటారా?
ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఒక ఎకరాకు నీళ్లు ఇవ్వలేదన్నారు కదా లెక్కలతో సహా నేను వస్తా మీరు సిద్ధమా?
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App