జూన్ 27, 2026

WhatsApp Image 2024 04 18 at 15.17.50

TRINETHRAM NEWS

Trinethram News : దుబాయ్…ఎడారిలో ఉన్న ఒక అద్బుత ఖరీదైన నగ రం దీని అబ్బురపరిచే శోభ అందరినీ ఆశ్చర్యపరుస్తుం ది. ప్రపంచ ప్రజలను తనవై పుకు తిప్పుకుంటుంది. అలాంటి దుబాయ్‌లో రెండేళ్లుగా జడలేకుండా పోయిన వర్షం.. ఒకేరోజు కురిసింది. యుఎఇ, ఒమన్, పరిసర ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురుస్తు న్నాయి.

ఇది క్లౌడ్ సీడింగ్ వల్లనా లేదా మరేదైనా ప్రకృతి వైపరీత్యమా..? అనే సందేహంలో ఉన్నారు శాస్త్రవేత్తలు. వరదల్లో మునిగిపోయిన ఈ ఎడారి దేశంలో హఠాత్తుగా ఏం జరిగిందో తెలియక జనాలు అయోమయంలో పడ్డారు.

16-17 ఏప్రిల్ 2024న అక స్మాత్తుగా ఈ ఎడారి నగరం లో భారీ వర్షాలు మొదల య్యాయి. వర్షం ఆగడం లేదు. మెరుపులు ఉరు ములు బెంబేలెత్తించాయి.. చుట్టూ దట్టమైన చీకటి అలుముకుంది. కొద్దిసేపటికే ఆకస్మిక వరద మొదలైంది. విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లు, మాల్స్, రోడ్లు, వ్యాపార సంస్థల్లోకి వరద నీరు చేరింది. పాఠశాలలు మూతపడ్డాయి.

దీనికి సంబంధించిన ఫోటో లు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవు తున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్ర యంలో గత 24 గంటల్లో 160 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధార ణంగా రెండేళ్లలో జరుగు తుంది.

ఇది స్వతహాగా పెద్ద ప్రకృతి విపత్తు అంటున్నారు విశ్లేషకులు, పరిశోధకులు. క్లౌడ్ సీడింగ్ అంటే కృత్రిమ వర్షం వల్ల ఇలా జరిగిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దుబాయ్ సోమ, మంగళ వారాల్లో క్లౌడ్ సీడింగ్ కోసం విమానాలను నడిపింది. ఏదో తప్పు జరిగినట్లుంది.

వాతావరణంలో అవస రమైన మార్పులు చేయడానికి టెక్నాలజీ పేరుతో మనుషులు చేసిన అజాగ్రత్త ప్రయత్నం ఇది. 15-16 తేదీల్లో అల్-ఐన్ విమానాశ్రయం నుంచి క్లౌడ్ సీడింగ్ విమానాలు వెళ్లా యని గల్ఫ్ స్టేట్ నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ తెలిపింది. గత రెండు రోజుల్లో ఈ విమానాలు ఏడుసార్లు ప్రయాణిం చాయి.క్లౌడ్ సీడింగ్ తప్పు జరిగినట్లు కనిపిస్తోంది….

You cannot copy content of this page