Trinethram News : మంగళగిరి : ఏపీ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయమైన నిధి భవన్‌లో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఉద్యోగులంతా విధుల్లో ఉండగానే భవనం రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో సుమారు 300 మంది ఉద్యోగులు భయంతో కిందికి పరుగులు తీశారు. సెంట్రల్ ఏసీలో షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు.
ఈ ప్రమాదంతో కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లు, దస్త్రాలు కాలిపోయి ఉండవచ్చని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల జీతభత్యాలు, వివిధ శాఖలకు సంబంధించిన లావాదేవీల బిల్లులు ఉండటంతో ఎంత నష్టం జరిగిందనేది ఇంకా అంచనా వేయలేదు. ఆన్‌లైన్ సిస్టం అయినప్పటికీ కంప్యూటర్లు కాలిపోవడం వల్ల లావాదేవీలకు సంబంధించిన పూర్తి సమాచారం మంటల్లో కాలిపోయి ఉండవచ్చని ఉద్యోగులు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మినహా ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


