
Financial assistance for hospital medical expenses of an underprivileged youth
స్థానిక ఇబ్రహీంపట్నం
నియోజకవర్గంలోని మన్నెగూడ మహోనియా ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న పులిజాల శంకర్ కు వైద్య ఖర్చుల కొరకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన నిరుపేద పులిజాల శంకర్ వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రమాదానికి గురై తీవ్ర అనారోగ్యం చెందగా, మెరుగైన వైద్య చికిత్స కోసం రంగారెడ్డి జిల్లా, మన్నెగూడలోని మహోనియా ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు, ఆసుపత్రి ఖర్చులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని నల్గొండ జిల్లా ఎన్సీపీ నాయకులు ఇడెం అరుణ్ కుమార్ తెలుసుకొని ఎన్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ చేతుల మీదుగా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా మేకల శ్రీధర్ యాదవ్ మాట్లాడుతూ ” పులిజాల శంకర్ ప్రమాదం జరిగి అనారోగ్యం పాలయ్యాడని, వైద్య చికిత్సకు డబ్బులకు ఇబ్బందులు పడుతున్నాడని తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేయడం జరిగిందని” అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర, ఎన్సీపీ నాయకులు ఇడెం అరుణ్ కుమార్, చెన్నూరి నాగరాజు, ప్రవీణ్ కుమార్, రవితేజ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App

Comments are closed.