Financial Assistance : అగ్ని ప్రమాద బాధితురాలికి ఆర్థిక సహాయం

TRINETHRAM NEWS
Financial assistance to fire victim

Financial Assistance : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్: మే 13; నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, తుమ్మగూడెం గ్రామానికి చెందిన మోదుగుమాటి మరియమ్మ ఇల్లు ఇటీవల కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోవడం జరిగింది. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి బాధిత కుటుంబానికి అండగా నిలిచి రూపాయలు ఐదు వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఆయన ఇచ్చిన హామీ మేరకు మంత్రి కార్యాలయ సిబ్బంది గ్రామానికి చేరుకుని తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు రాజారావు సమక్షంలో బాధితురాలికి నగదు సహాయాన్ని అందించడం జరిగింది.
కష్టకాలంలో వెంటనే స్పందించి సహాయం అందించిన మంత్రి కి గ్రామస్థులు మరియు బాధిత కుటుంబ సభ్యులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top