ఎట్టకేలకు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి ఫలించింది. ఎట్టకేలకు ఆయన కృషితో కర్ణాటక నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు కుంకీ ఏనుగులు రానున్నాయి.
Trinethram News : ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో ఏనుగులు సృష్టిస్తోన్న విధ్వంసానికి ప్రజల పంట పొలాలు పాడవుతున్నాయి. ఒక్కోసారి మదమెక్కిన ఏనుగులు చేసే హడావుడితో ఆయా ప్రాంతాలు అట్టుడికి పోతున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి మదమెక్కిన ఏనగులను కంట్రోల్ చేయడానికి కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు తెప్పిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పర్యావరణం, అటవీ శాఖమాత్యులుగా ఉన్న పవన్ కళ్యాణ్. ఈ రోజు బెంగళూరు చేరుకొని కర్ణాటక గవర్నమెంట్ నుంచి పవన్ కళ్యాణ్ కుంకీ ఏనుగులు స్వీకరించారు.
కర్ణాటక విధాన సౌధలో ఉదయం 11 గంటలకు కుంకీ ఏనుగుల అప్పగింత కార్యక్రమం జరిగింది. కర్ణాటక ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, అటవీ పర్యావరణశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే అధికారికంగా ఆరు కుంకీ ఏనుగులను ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అప్పగించారు.
రాష్ట్రంలో ఏనుగుల గుంపులు పంట పొలాలు ధ్వంసం చేయడం, కొన్ని సందర్భాల్లో మనుషులు ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. ఈ సమస్యల నివారణకు కుంకీ ఏనుగులు అవసరం. కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ నుంచి కుంకీ ఏనుగులు పొందేందుకు పవన్ కళ్యాణ్ కొన్ని నెలల క్రితం బెంగళూరు వెళ్ళి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రులతో సమావేశమై తమ రాష్ట్రంలోని సమస్యను వివరించారు. తమ రాష్ట్రం నుంచి ఆరు కుంకీ ఏనుగులు పంపేందుకు అక్కడి ప్రభుత్వం అంగీకరించింది. వాటిని ఈ రోజు అప్పగించడం విశేషం. ఈ ఏనుగుల పేర్లు రంజని, దేవా, కృష్ణా, అభిమన్యు, మహేంద్ర అని అధికార వర్గాలు తెలిపాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


