త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి ఐదు మండలాల అధ్యక్షులకు బ్లాక్ అద్యక్షులకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదేం వీరయ్య జిల్లా అబ్జర్వర్లు టిపిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పి ప్రమోద్ కుమార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం పట్వారిగూడెం గ్రామంలో చెలికాని ఆదెమ్మ ఫంక్షన్ హాల్ లో గౌరవ శాసనసభ్యులు జారె ఆదినారాయణ అధ్యక్షతన ఏఐసీసీ ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలు దమ్మపేట, అశ్వారావుపేట, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి, చుండ్రుగొండ మండలాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టపర్చే దిశగా మండల అధ్యక్షులు మరియు బ్లాక్ అధ్యక్షుల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. పార్టీ పట్ల అపారమైన నిబద్ధతతో పనిచేస్తున్న కార్యకర్తలు, యువ నాయకులు, గతంలో పార్టీ కోసం నిబద్ధతతో సేవలందించిన అనుభవజ్ఞుల నుంచి ఈ దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. అర్హత, నిస్వార్థ సేవా దృక్పథం, సామాజిక ప్రతిష్టను ప్రధానంగా పరిగణనలోకి తీసుకొని నూతన నాయకత్వానికి అవకాశాలు కల్పించడమే ఈ ప్రక్రియ యొక్క ప్రధాన ఉద్దేశం.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మండల స్థాయి బాధ్యతదారులు, ప్రజాప్రతినిధులు అనుబంధ సంఘాల నాయకులు మహిళా సంఘాల నాయకులు మరియు పార్టీకి అత్యంత సన్నిహితంగా పనిచేస్తున్న కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


