Surprise checks : ఆత్రేయపురంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు

TRINETHRAM NEWS

-20 లీటర్ల సారాతో మహిళ అరెస్టు

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం రాజవరం,పేరవరం గ్రామాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ జి.కృష్ణారావు ఆదేశాల మేరకు కొత్తపేట డిఎస్పి సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ 25 మంది పోలీసులతో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఈ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రికార్డు లేని 20 వాహనాలను స్వాధీన పరుచుకున్నారు. వాటికి సక్రమంగా ఉన్న రికార్డు చూపిస్తే తిరిగి ఇస్తామని లేదంటే బ్రేక్ ఇన్స్పెక్టర్ కు అప్పగిస్తామని ఈ సందర్భంగా సిఏ విద్యాసాగర్ తెలిపారు.

అలాగే రాజువరంలో ఓ మహిళ 20 లీటర్ల సారా 400 లీటర్ల బెల్లపూట కలిగి ఉండటంతో ఆమెను అరెస్ట్ చేసి డ్రమ్ములు,గ్యాస్ స్టౌవ్ లను స్వాధీనం చేసుకున్నారు. మారుమూల గ్రామాల్లో సారాయి, గంజాయి వంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నందున ఇటువంటి ఆకస్మిక తనిఖీలను పోలీసులు చేపడుతుంటారు.ఈ తనిఖీలలో ఆత్రేయపురం, కొత్తపేట, ఆలమూరు ఎస్సైలు రాము, సురేంద్ర, నరేష్ లతో పాటు ఎఎసైలు,హెచ్‌సిలు,కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

surprise checks in Athreyapuram

You cannot copy content of this page

Scroll to Top