Mahatma Gandhi Jayanti : కమిషనరేట్ లో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

TRINETHRAM NEWS

Father of Nation Mahatma Gandhi Jayanti Celebrations in Commissionerate

అహింసే ఆయుధం అందరికి ఆదర్శం మహాత్ముని జీవితం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజీ,పోలీస్ అధికారులు గాంధీ చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ…. జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం, ధర్మం, సహనం, అహింసా మార్గాలు ప్రతిఒక్కరూ అనుసరించాలని, గాంధీ గారు అహింస మార్గంతోనే దేశానికి స్వాతంత్య్రం సాధించామని, ప్రతిఒక్కరూ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి చెందుతుందన్నారు. దేశ పౌరులు,గాంధేయ మార్గంలో నడుచుకోవాలని, గాంధీ చూపిన బాటలో విధులు నిర్వర్తించి ప్రజలకు పోలీసు సేవలను అందించాలని సూచించారు.
ఈకార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐ దామోదర్, మల్లేశం, ఆర్ ఎస్ఐ లు అనిల్, శ్రావణి, పోచలింగం, వివిధ వింగ్స్ సిబ్బంది, ఏఆర్, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top