
Student Appeared for Exam : త్రినేత్రం న్యూస్ : నల్గొండ జిల్లా మోత్కూర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడైన ఎల్లయ్య గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన నేపథ్యంలో తండ్రి మరణించిన బాధను దిగమింగుకొని, ఆయన కుమారుడు హర్షవర్థన్ పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. కంటికి రెప్పలా కాపాడిన తండ్రి దూరమయ్యాడనే బాధను పంటి బిగువున భరిస్తూ, పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ఓ విద్యార్థి పరీక్షకు హాజరైన ఈ ఘటన అందరినీ కలిచివేసింది

